Covid-19 : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
Covid-19 : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 25వేలకు దిగిరాగా.. తాజాగా 35వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 37,169 మంది బాధితులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 25వేలకు దిగిరాగా.. తాజాగా 35వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 37,169 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. మరో 440 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.14శాతం ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్ కేసులున్నాయని, 148 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది.
ప్రస్తుతం రికవరీ రేటు 97.52 శాతానికి చేరుకుందని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరాయి. ఇందులో మొత్తం 3,14,85,923 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 4,32,519కు మంది ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్లో భాగంగా గడిచిన 24 గంటల్లో 55,05,075 డోసులు వేయగా.. ఇప్పటి వరకు 56,06,52,030 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే మొత్తం 49.84 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

