Cheetah Cubs : భారత్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ చీతా (Project Cheetah)’ లో మరో ముందడుగు పడింది. మన దేశంలోనే జన్మించిన 32 నెలల చీతా (KGP21).. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని కునో జాతీయ పార్కు (Kuno National Park) లో అయిదు కూనలకు జన్మనిచ్చింది. కేంద్రమంత్రి (Union Minister) భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
దాంతో దేశంలో మొత్తం చీతాల సంఖ్య 60 కి చేరినట్లు తెలిపారు. ఇందులో 41 చీతాలు భారత్‌లోనే జన్మించాయని చెప్పారు. ‘భారత్‌లోనే పుట్టి కూనలకు జన్మనిచ్చిన చీతాల్లో ముఖి, కేజీపీ12 తర్వాత కేజీపీ21 మూడోది. ఈ అయిదు కూనల తండ్రి ఆఫ్రికాలోని బోట్స్వానాకు చెందిన మగ చీతా. దాంతో భారత్‌లోనూ బోట్స్వానా వంశక్రమం మొదలైంది. ప్రాజెక్టు చీతాలో భాగమైన వెటర్నరీ వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది, నిర్వాహకులకు భూపేందర్ యాదవ్ అభినందనలు తెలిపారు.