e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News Tokyo Olympic : హాకీలో స్పెయిన్‌పై భారత్‌ ఘన విజయం

Tokyo Olympic : హాకీలో స్పెయిన్‌పై భారత్‌ ఘన విజయం

టోక్యో : ఒలిపింక్స్‌ హాకీలో స్పెయిన్‌పై టీమ్‌ ఇండియా ఘన విజయం సాధించింది. పూల్‌-ఏ మూడో మ్యాచ్‌లో 3-0 తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో రెండింట్లో విజయం సాధించింది. మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌పై భారత జట్టు ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిక్వార్టర్‌ ముగిసే సరికి స్పెయిన్‌పై 2-0 గోల్స్‌ ఆధిక్యంలో భారత్‌ నిలిచింది. మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో రూపిందర్‌సింగ్‌ అదరగొట్టాడు. మ్యాచ్‌లో 15 నిమిషాలు, 51 నిమిషాల సమయంలో రెండు గోల్స్‌ వేసి, విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిమ్రన్‌జీత్‌ సింగ్‌ ఒక గోల్‌ సాధించాడు. మొదటి స్పెల్‌లో రెండు గోల్స్ చేసిన భారత జట్టు.. రెండవ స్పెల్‌లో కొంచెం రక్షణాత్మకంగా ఆడింది. స్పెయిన్ సైతం ఎదురుదాడికి దిగినా.. భారత్ ధీటుగానే ఎదుర్కొంది. స్పెయిన్‌కు రెండు పెనాల్టీ కార్నర్స్‌ లభించినా.. భారత్ ధీటుగా ఎదుర్కొని విజయాన్ని అందుకున్నది.

ఇవి కూడాచదవండి..

27.07.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
కాలేయం కాపాడుకుందాం
టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌ భేటీ
Tokyo Olympic : ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు నిరాశే
జూరాలకు 3.35లక్షల క్యూసెక్కుల వరద
లిబియాలో పడవ బోల్తా.. 57 మంది మృతి!

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana