U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్‌పై భారత్ సంచలన విజయం!
U19 Asia Cup | చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్ పోరు అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది.
U19 Asia Cup | చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్ పోరు అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్ నిర్దేశించిన 340 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 49.6 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఒక్క వికెట్ తేడాతో గెలిచి అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. అబ్దుల్ ఖాదిర్ 54 బంతుల్లో 80 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 60 బంతుల్లో 63 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం అందించాడు. దీంతో పాకిస్తాన్ భారీ స్కోరు సాధించింది.
భారత బౌలర్లలో కావ్య పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చిరుగుపాటి వెంకట మూడు వికెట్లతో రాణించాడు. చివరి ఓవర్లలో భారత బౌలర్లు కట్టడి చేయడంతో పాకిస్థాన్ స్కోరు 340 పరుగుల లోపే నిలిచింది.
నిలకడగా ఆడిన భారత్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్, కెప్టెన్ లక్ష్య రాజేశ్ రాయచందన్ మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్యవీర్ సెహ్వాగ్ 61 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం లక్ష్య రాజేశ్ రాయచందన్ 101 బంతుల్లో 80 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
అయితే ఆర్యవీర్ ఔటైన తర్వాత వికెట్లు వరుసగా పడిపోయాయి. వీకే వినీత్ 24, అర్జున్ రాజ్‌పుత్ 16, యశ్బర్ధన్ చౌహాన్ 9 పరుగులు చేశారు. కెప్టెన్ లక్ష్యతో పాటు అన్వయ్ ద్రవిడ్ కూడా పెవిలియన్‌కు చేరడంతో భారత్ కష్టాల్లో పడింది.
ఒక దశలో భారత్ 251 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. లక్ష్యం ఇంకా దూరంలో ఉండగా వికెట్లు వరుసగా పడటంతో పాకిస్తాన్ విజయం ఖాయమనిపించింది. ఈ సమయంలో మానల్ చౌహాన్, మొహిత్ ఉల్వా అద్భుత పోరాటం చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మానల్ చౌహాన్ 32 బంతుల్లో 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
మొహిత్ ఉల్వా మరింత దూకుడుగా ఆడాడు. కేవలం 22 బంతుల్లో 43 పరుగులు చేసి భారత విజయంపై ఆశలు రేకెత్తించాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మానల్ ఔటైనా మొహిత్ పోరాటం ఆపలేదు. చిగురుపాటి వెంకటతో కలిసి జట్టును విజయానికి చేరువ చేశాడు.
చివరి ఓవర్లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. పాకిస్తాన్ తరఫున అహ్మద్ హుస్సేన్ బంతిని అందుకున్నాడు. మరోవైపు మొహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట క్రీజులో ఉన్నారు. తొలి బంతికి మొహిత్ పరుగులేమీ చేయలేదు. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి వెంకట ఒక పరుగు సాధించడంతో భారత్ విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచింది. నాలుగో బంతికి మొహిత్ మరో పరుగు తీశాడు. ఐదో బంతికి వెంకట సింగిల్ తీసుకోవడంతో స్కోరు సమం కావడానికి అవసరమైన పరిస్థితి ఏర్పడింది. చివరి బంతికి మొహిత్ ఉల్వా ఫోర్ బాదడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. 9 వికెట్లు కోల్పోయినప్పటికీ అద్భుత పోరాటంతో భారత్ ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్‌పై భారత్ సంచలన విజయం!
AP News | అప్పు తీర్చలేదని తల్లిని, 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు
‘సింగరేణి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు’
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Ponds Auction | రేవంత్ రెడ్డి ఇలాఖాలో సాగు నీటి కోసం చెరువుల, బావుల వేలంపాట.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

