Ponds Auction | రేవంత్ రెడ్డి ఇలాఖాలో సాగు నీటి కోసం చెరువుల, బావుల వేలంపాట.. వీడియో
Ponds Auction | కళ్ల ముందే చేతికొచ్చిన పంటను ఎండిపోతుంటే చేసేదేమి లేక రైతులు అప్పులు చేసి భారీగా ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకర్లతో నీటిని పారబెట్టుకున్న వీడియోలు, కరెంట్ కోతల వల్లే జనరేటర్లు పెట్టుకున్న వీడియోలు ఇప్పటికే చాలా కనిపించాయి.
Ponds Auction | కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కట్టినట్టుగా చూపించే దృశ్యాలు చాలా రోజులుగా తెరపైకి వస్తున్నాయని తెలిసిందే. ఎల్‌నినో ప్రభావం ఓ వైపుంటే.. మరోవైపు కరెంట్ కోతలు, సాగునీరు విడుదల చేయకపోవడంతో ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తిప్పలు పడుతున్నారు. కళ్ల ముందే చేతికొచ్చిన పంటను ఎండిపోతుంటే చేసేదేమి లేక అప్పులు చేసి భారీగా ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకర్లతో నీటిని పారబెట్టుకున్న వీడియోలు, కరెంట్ కోతల వల్లే జనరేటర్లు పెట్టుకున్న వీడియోలు ఇప్పటికే చాలా కనిపించాయి.
ఇక పంట సాగు కోసం ఏకంగా చెరువులోని నీళ్లను వేలం వేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి సొంత జిల్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం గమనార్హం.
కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామంలో నీళ్లు, కరెంటు లేక పంటలు ఎండిపోతుండడంతో రైతులు చెరువులు, కుంటలు, బావుల్లోని నీళ్లను వేలంపాట పాడారు. ఈ వేలంపాటలో 10 మంది రైతులు నల్లచెరువును రూ.2 లక్షలకు, ఊరుకుంటను రూ.1 లక్షకు, ఊరబావిని రూ.81 వేలకు దక్కించుకున్నారు. అయితే వేలంపాట పాడిన రైతులు ఇదే అదనుగా భావించి తాము దక్కించుకున్న నీళ్లను మోటార్లతో ఎత్తిపోయాలంటే రోజుకు రూ.7 వేలు చెల్లించాలని ఇతర రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఈ క్రమంలో వేలంపాట పాడిన రైతులు నీళ్లన్నీ వాడుకోవడంతో ఆయకట్టు కింద పంట ఎండిపోతుందని అసలైన రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువులు, బావుల వేలంపాట విషయం బయటకొచ్చింది. నీళ్లు కిందకు పోతున్నప్పుడు ఒడిసిపట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంట సాగుకు చెరువులోని నీళ్లను వేలంపాట పాడిన రైతులు
రేవంత్ రెడ్డి సొంత జిల్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో దయనీయ పరిస్థితులు
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనం
కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామంలో నీళ్లు, కరెంటు లేక పంటలు ఎండిపోతుండడంతో చెరువులు, కుంటలు, బావుల్లోని నీళ్లను వేలంపాట పాడిన రైతులు
వేలంపాటలో నల్లచెరువును రూ.2 లక్షలకు, ఊరుకుంటను రూ.1 లక్షకు, ఊరబావిని రూ.81 వేలకు దక్కించుకున్న 10 మంది రైతులు
అయితే ఈ నీళ్లను మోటర్లతో ఎత్తిపోయాలంటే రోజుకు రూ.7 వేలు చెల్లించాలని ఇతర రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వేలంపాట పాడిన రైతులు
నీళ్లు కిందకు పోతున్నప్పుడే ఒడిసిపట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
వేలంపాట పాడిన రైతులు నీళ్లన్నీ వాడుకోవడంతో ఆయకట్టు కింద అసలైన రైతుల పంట ఎండిపోతుందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో బయటపడిన వేలంపాట బాగోతం
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2026
Read Also :
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponds Auction | రేవంత్ రెడ్డి ఇలాఖాలో సాగు నీటి కోసం చెరువుల, బావుల వేలంపాట.. వీడియో
Rahul Gandhi | పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోంది.. భారత్ సమిట్‌లో రాహుల్‌గాంధీ
Hyderabad devotee | తిరుమలలో పోగొట్టుకున్న 40 గ్రాముల బంగారు కడియాన్ని హైదరాబాద్ భక్తురాలికి తిరిగి అప్పగింత
తుంగతుర్తిలో ఘనంగా విద్యాసాగర్ రావు జయంతి వేడుకలు
సారపాకలో బాల గ్రామ సభ
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

