IND vs NZ : న్యూజిలాండ్ ఓపెనర్ డ్వేన్ కాన్వే శతకం సాధించాడు. చాహల్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతనికి ఇదిమూడో సెంచరీ. అతను 71 బంతుల్లోనే వంద పరుగులు కొట్టాడు. 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ బౌలింగ్‌లో కాన్వే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మిచెల్‌తో మూడో వికెట్‌కు 68 రన్స్ జోడించాడు. దాంతో, కివీస్ 24 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 75 రన్స్ చేసింది.