అతిథి పాత్రల్లో నటించేందుకు ఏమాత్రం సందేహించరు బాలీవుడ్ అగ్ర కథానాయకులు. సహచర హీరోల చిత్రాల్లో కీలకమైన పాత్ర, తాము నటించాల్సిన అవసరం ఉంటే సెట్లో వాలిపోతారు. సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి కథానాయకుడే. షారుక్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా ‘పఠాన్’లోనూ సల్మాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. అమీర్‌ఖాన్ హాలీవుడ్ రీమేక్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో సల్మాన్‌కు ఓ గెస్ట్ రోల్ ఉందట. ఈ రెండు చిత్రాల్లో సల్మాన్ కనిపించే సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయని అనుకుంటున్నారు. ఇక సల్మాన్ నటిస్తున్న ‘టైగర్ 3’, ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘కభీ ఈద్ కభీ దీవాళి’ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.