న్యూఢిల్లీ : మిల్కీ బ్యూటీ హాట్ మూమెంట్స్‌తో జైలర్ సాంగ్ కావాలయ్యా ఓ రేంజ్లో సోషల్ మీడియాలో (Viral Video) ట్రెండింగ్ కాగా, ఆ క్రేజీ నెంబర్‌ను పలువురు నెటిజన్లు రీక్రియేట్ చేస్తూ సందడి చేస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఆ పాటలో మెరిసిన తమన్నా హుక్ స్టెప్ విశేషంగా ఆకట్టుకుంది.
ఇక ఓ మహిళ తమన్నా కాస్ట్యూమ్‌ను పోలిన అవుట్‌ఫిట్ ధరించి అదే పాట టీవీ స్క్రీన్‌పై వస్తుండగా ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. మనీషా సాతి అనే ఇన్‌స్టా యూజర్ ఈ క్లిప్‌లో కిల్లర్ మూమెంట్స్‌తో తమన్నాను దించేసింది.
మనీషా డ్యాన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు గుప్పించారు. జబర్ధస్త్ యార్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా పెద్దసంఖ్యలో నెటిజన్లు హార్ట్, ఫైర్ ఎమోజీలతో రియాక్టయ్యారు.
Read More :
Health News | రజస్వల అయిన తర్వాత ఆడపిల్లలు ఎత్తు పెరగడం ఆగిపోతుందా?