జడ్చర్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి
పార్టీలో చేరిన యూత్ కాంగ్రెస్ నాయకులు
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే పలు పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జడ్చర్లకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు టీవీ ప్రకాష్‌గౌడ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున యూత్‌కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతోపాటు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి యూత్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకాష్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పీ మురళి, కౌన్సిలర్లు సతీశ్, నందకిషోర్‌గౌడ్, ఉమాశంకర్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, రమేశ్, టీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, శంకర్‌నాయక్, శ్యాం, కోనేటి మురళి, మతీన్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు గదుల నిర్మాణంకు భూమిపూజ
మిడ్జిల్, ఫిబ్రవరి 2: మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి బుధవారం ఎమ్యెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పరిశీలించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి అదనపు గదులు పూర్తి చేయాలన్నారు. అనంతరం మండల నాయకులు ముందస్తుగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ కాంతమ్మ, నాయకులు సుధాబాల్రెడ్డి, దేవేందర్, జంగారెడ్డి, ఎల్లయ్యయాదవ్, రాజు, ఆంజనేయులు, రమేశ్, కుమార్, పాండు, వెంకటయ్య పాల్గొన్నారు.
ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయం
రాజాపూర్, ఫిబ్రవరి 2: ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలకేంద్రంలో మొక్కలు నాటారు. అనంతరం ప్రభు త్వ రూ.22 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. గురువారం జడ్చర్లలో నిర్వహించను న్న మెగా రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, నాయకులు నరహరి, మహిపాల్‌రెడ్డి, యాదగిరి, విజయ్, దేవేందర్, సత్యయ్య, ఆనంద్‌గౌడ్, వెంకట్రాంరెడ్డి, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.