IMDb Most Popular Webseries 2025 | ప్రముఖ మూవీ డేటాబేస్ సంస్థ IMDb (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) 2025 సంవత్సరానికి గానూ భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది ఓటీటీలలో క్రైమ్ థ్రిల్లర్లు మరియు పాపులర్ సిరీస్‌ల సీక్వెల్స్ హవా ఎక్కువగా కొనసాగింది. ముఖ్యంగా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి సిరీస్ ‘ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్’ అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది టాప్ టెన్‌లో నిలిచిన వెబ్ సిరీస్‌లను చూసుకుంటే.
1. ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Ba***ds of Bollywood)
ప్లాట్‌ఫారమ్: నెట్‌ఫ్లిక్స్
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమైన ఈ సిరీస్ బాలీవుడ్ తెర వెనుక చీకటి కోణాలను, నెపోటిజం వర్సెస్ అవుట్‌సైడర్స్ పోరాటాన్ని వ్యంగ్యంగా చూపిస్తూ సంచలనం సృష్టించింది. ఇందులో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ల గెస్ట్ అప్పీరెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది.
2. బ్లాక్ వారెంట్ (Black Warrant)
ప్లాట్‌ఫారమ్: నెట్‌ఫ్లిక్స్
1980వ దశకంలో తిహార్ జైలులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించిన ఈ సిరీస్, భారత న్యాయ వ్యవస్థలోని లోపాలను కళ్ళకు కట్టినట్లు చూపించి రెండో స్థానంలో నిలిచింది.
3. పాతాళ్ లోక్: సీజన్ 2 (Paatal Lok S2)
ప్లాట్‌ఫారమ్: అమెజాన్ ప్రైమ్
పాతాల్ లోక్ మొదటి సీజన్ వచ్చిన తర్వాత నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఇన్స్పెక్టర్ హాథీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్) ఈసారి నాగాలాండ్ డ్రగ్ సిండికేట్ గుట్టును రట్టు చేసే క్రమంలో చూపించిన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.
4. పంచాయత్: సీజన్ 4 (Panchayat S4)
ప్లాట్‌ఫారమ్: అమెజాన్ ప్రైమ్
ఫూలేరా గ్రామంలో జరిగిన ఎన్నికల రాజకీయం, మంజు దేవి వర్సెస్ క్రాంతి దేవి పోరాటం ఈ సీజన్లో నవ్వులతో పాటు ఎమోషన్స్‌ను పండించింది.
5. మండల మర్డర్స్ (Mandala Murders)
ప్లాట్‌ఫారమ్: నెట్‌ఫ్లిక్స్
విశేషం: వాణీ కపూర్ లీడ్ రోల్లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్, పురాతన ఆచారాల (Occult) నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీగా ప్రేక్షకులను థ్రిల్ చేసింది.
6. ఖౌఫ్ (Khauf)
ప్లాట్‌ఫారమ్: అమెజాన్ ప్రైమ్
సూపర్ నేచురల్ హారర్ మరియు సైకలాజికల్ డ్రామా ఇష్టపడే వారికి ఇది ఫేవరెట్ ఛాయిస్. మనుషుల భయాలను మంత్ర తంత్రాలతో ముడిపెట్టి ఆసక్తికరంగా మలిచారు.
7. స్పెషల్ ఆప్స్: సీజన్ 2 (Special Ops S2)
ప్లాట్‌ఫారమ్: జియోహాట్‌స్టార్
కేకే మీనన్ తన మార్క్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో మరోసారి మెరిశారు. అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రలను ఛేదించే దేశభక్తి కథాంశంతో ఇది దూసుకుపోయింది.
8. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (Khakee 2)
ప్లాట్‌ఫారమ్: నెట్‌ఫ్లిక్స్
నీరజ్ పాండే సృష్టించిన ఈ సిరీస్ బెంగాల్ మాఫియా మరియు పోలీసుల మధ్య సాగే మైండ్ గేమ్స్ మీద ఫోకస్ చేసింది.
9. ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 (The Family Man S3)
ప్లాట్‌ఫారమ్: అమెజాన్ ప్రైమ్
శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్) ఈసారి ఈశాన్య భారతదేశం మరియు చైనా సరిహద్దుల్లోని కుట్రలను ఎలా అడ్డుకున్నాడనేది ప్రధాన ఇతివృత్తం.
10. క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్
ప్లాట్‌ఫారమ్: జియోహాట్‌స్టార్
పంకజ్ త్రిపాఠి నటించిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా, కుటుంబం చుట్టూ తిరిగే ఒక క్లిష్టమైన కేసును ఎలా డీల్ చేశారో చూపిస్తూ టాప్ 10లో నిలిచింది.