విద్యానగర్, నవంబర్ 2 : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆదివారం కరీంనగర్లోని వీకన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా డాక్టర్ పీ కిషన్, కార్యదర్శిగా వీ అశోక్, కోశాధికారిగా డాక్టర్ దయాల్ సింగ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ విజయరావు, రెడ్డి డాక్టర్ ఎంఎల్ఎన్ రెడ్డి, డాక్టర్ బీ శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ టీవీ శ్రీనివాస్, డాక్టర్ ఆర్ సునీత, డాక్టర్ పీ శరత్చంద్ర, డాక్టర్ యు రామకృష్ణ, డాక్టర్ బి రూప్లాల్ ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్ రావు, వైద్యులు శ్యాంసుందర్, విజయేందర్ రెడ్డి, రామ్ కిరణ్ పొలాస, కరీంనగర్ అధ్యక్షురాలు ఆకుల శైలజ, కార్యదర్శి మహేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.