న్యూఢిల్లీ, జూన్ 11: సీబీఎస్ఈ పోర్టల్‌లో లోపాలను గుర్తించిన 19 ఏండ్ల ఎథికల్ హ్యాకర్ నిసర్గ అధికారి టాలెంట్‌ను గుర్తించిన ఐఐటీ కాన్పూర్ అతనికి జాబ్ ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని నిసర్గ ఎక్స్ వేదికగా ప్రకటించాడు. ‘ఇది నాకు చాలా థ్రిల్‌గా ఉంది.
ఐఐటీ కాన్పూర్ లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌లో ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌గా నాకు జాబ్ వచ్చింది. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్రా అగర్వాల్ గత నెలలో నన్ను ఢిల్లీలో కలిశారు. చర్చల తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చారు’ అని నిసర్గ వెల్లడించాడు.