ఈశ్వర్, సాయి విక్రాంత్, రిషి, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నీకు నాకు రాసుంటే’. యష్ ఎంటర్టైన్మ్ంట్స్ పతాకంపై యష్ రాజ్ సమర్పణలో స్రవంతి పలగని, అభిషేక్ ఆవల నిర్మిస్తున్నారు. కేఎస్ వర్మ దర్శకుడు. సాంగ్ రికార్డింగ్‌తో తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. గాయని సునీత అతిథిగా హాజరై చిత్రబృందానికి విశెష్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కేఎస్ వర్మ మాట్లాడుతూ..‘తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించనున్నాం. హైదరాబాద్, అరకు, ఊటీ, చెన్నై, మంగళూరు తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. ఇదో ప్రయోగాత్మక చిత్రమవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. సత్యరాజ్, సుమన్, అలీ, రఘుబాబు, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.