హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఐసెట్ ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రవి తెలిపారు.
టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రాథమిక ‘కీ’ని అధికారులు విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30వరకు నిర్వహించిన పరీక్షల ప్రాథమిక ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరిచారు. ఈనెల 8లోపు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
8న ఎల్పీసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన వారికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఎల్పీ సెట్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 8న నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఎల్పీ సెట్లో 355 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని, వీరికి అడ్మిషన్లు కల్పించేందుకు సోమవారం మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.