IBPS : ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)స.. ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer), స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) రిక్రూట్మెంట్ పరీక్ష-2026 (Recruitment Exam – 2026) దరఖాస్తు గడువును పొడిగించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా 2026 జూలై 26 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా పాల్గొంటున్న ప్రభుత్వరంగ బ్యాంకులలో మొత్తం 7,460 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం 7,460 పోస్టుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు, 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉన్న అందుకు సమాన అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన డిగ్రీ సర్టిఫికెట్, మార్క్‌షీట్‌ను దగ్గర ఉంచుకోవాలి. దరఖాస్తును నింపేటప్పుడు గ్రాడ్యుయేషన్ మార్కులను తప్పనిసరిగా నమోదు చేయాలి.
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అర్హత ప్రమాణాలు పోస్టును బట్టి మారుతాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులను సబ్మిట్ చేసే ముందు అధికారిక వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని పరీక్ష నిర్వాహకులు సూచించారు.