IBPS Jobs | గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
IBPS Jobs | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఐబీపీఎస్ సువర్ణావకాశం కల్పించింది. గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేష్‌ను ఐబీపీఎస్ విడుదల చేసింది.
IBPS Jobs | ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) బ్యాంకింగ్ రంగంలోని ఖాళీలను భర్తీ చేసే సంస్థ. స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ఇది దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అర్హులైన ఉద్యోగులను ఎంపిక చేస్తుంది. తాజాగా రీజినల్ గ్రామీణ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా ఉన్న 13,706 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 8183 ఆఫీస్ అసిస్టెంట్, 4256 ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3) పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది.
ఖాళీల వివరాలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) 8183
ఆఫీసర్ స్కేల్ 1 (అసిస్టెంట్ మేనేజర్) 4256
ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) 666
ఆఫీసర్ స్కేల్ 2 (ఐటీ ఆఫీసర్) 182
ఆఫీసర్ స్కేల్ 2 (చార్టెర్డ్ అకౌంటెంట్) 81
ఆఫీసర్ స్కేల్ 2 (లా ఆఫీసర్) 46
ఆఫీసర్ స్కేల్ 2 (ట్రెజరీ మేనేజర్) 18
ఆఫీసర్ స్కేల్ 2 (మార్కెటింగ్ ఆఫీసర్) 16
ఆఫీసర్ స్కేల్ 2 (అగ్రికల్చరల్ ఆఫీసర్) 38
ఆఫీసర్ స్కేల్ 2 (సీనియర్ మేనేజర్) 220

Rrb Jobs
అర్హతలు
సంబంధిత పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, సీఏ, లా పాసై ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, మార్కెటింగ్ తదితర సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి. వయసు పోస్టును బట్టి 18 నుంచి 40 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175, మిగతా అభ్యర్థులు అందరికి రూ. 850.
ఎంపిక
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) ఉంటుంది. మిగతా పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎంపికైన వారికి ఆఫీస్ అసిస్టెంట్లకు రూ. 35,000-37,000, స్కేల్ 1 ఆఫీసర్‌కు రూ. 75,000-77,000, స్కేల్ 2 ఆఫీసర్‌కు రూ. 65,000-67,000, స్కేల్ 3 ఆఫీసర్‌కు రూ. 80,000-90,000 వరకు జీతం ఉంటుంది.

Online Apply
పరీక్ష కేంద్రాలు
తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఏపీలోని అనంతపూర్, చీరాల, గుంటూర్, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్లో, మెయిన్స్ జనవరి 2027లో ఉంటుంది. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ www.ibps.inలో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

