Kapil on Jadeja | టీం ఇండియాలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై 1983 వరల్డ్ కప్ విజేత టీం సారధి-హర్యానా హరికేన్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఒత్తిడి లేకుండా జడేజా ఆడుతున్న తీరు తనకెంతో ఇష్టం అని వ్యాఖ్యానించాడు. ఒత్తిడి లేకుండా ఆడిన వారే బాగా ఆడతారని, ఒత్తిడి ఉంటే సరిగ్గా ఆడలేరన్నాడు. జడేజా మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ ఆడటం వల్లే బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తాడని సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పాడు. ఫీల్డింగ్‌లోనూ తన కంటే ప్రత్యేకత చాటుకుంటాడన్నాడు.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతోపాటు బౌలింగ్‌లో 9 వికెట్లు తీసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కపిల్‌దేవ్ రికార్డును అధిగమించాడు. ఏడో బ్యాట్స్‌మన్‌గా రంగంలోకి అత్యధిక పరుగులు చేసి ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌లో నిలిచాడు.