I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
I Hate Marriage | నేటి తరంలో ప్రేమ, పెళ్లి, కెరీర్ మరియు స్వతంత్ర జీవనంపై యువత ఆలోచనలను ప్రతిబింబిస్తూ తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఐ హేట్ మ్యారేజ్' (I Hate Marriage).
Sugi Vijay | నేటి తరంలో ప్రేమ, పెళ్లి, కెరీర్ మరియు స్వతంత్ర జీవనంపై యువత ఆలోచనలను ప్రతిబింబిస్తూ తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఐ హేట్ మ్యారేజ్’ (I Hate Marriage). సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రంతో పరమేశ్ రేణుకుంట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్య సినిమా బ్యానర్‌పై మాదం దయానంద్, కార్తిక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘అప్పుడే పెళ్లా’ లిరికల్ వీడియో సాంగ్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించడమే కాకుండా ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల మాట్లాడుతూ.. “ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి జెన్ జెడ్ (Gen Z) తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. జీవితంలో యువత ఎదుర్కొనే భావోద్వేగాలు, నిర్ణయాలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం ఇందులో ఉంటుంది. ప్రతి యువత ఈ సినిమాలోని పాత్రలతో కనెక్ట్ అవుతారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇదొక చక్కటి అనుభూతిని ఇస్తుంది” అని తెలిపారు.
ఈ చిత్రంలో హారిక రాజేందర్, సాహితి కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తుండగా, పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి, ప్రభావతి, ఆశ్రిత వేముగంటి, లోహిత్ కుమార్, బేబి తమోఘ్న, రాధ రాయసం, లక్ష్మి, జాకీర్, విజయ్ కుమార్, దాసరి పద్మ రేఖ, శ్రీదేవి ఆర్రోజు, మెయిల్ రమేష్, అరుణ్ కుమార్ రెడ్డి, ఇందు, అఖండ సుధాకర్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని విజయ్ సి. కుమార్ అందించగా, సంగీతం మరియు పాటలను వరికుప్పల యాదగిరి సమకూర్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ప్రవీణ్ ఇమ్మడి అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను ఆవుల వెంకటేష్ నిర్వహించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా మోహన్ జల్లా వ్యవహరించగా, అడిషనల్ డైలాగ్స్‌ను శ్రీనివాస్ తేజ అందించారు. అల్లు చాణక్య, రాజ్ కృష్ణ కొరియోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి దయానంద్ మాదం, కార్తిక్ వెంపటి నిర్మాతలుగా వ్యవహరించగా, సంతోష్ రేణికుంట్ల, కాశీగారి కోదండ రామ శర్మ సహ నిర్మాతలుగా ఉన్నారు. రచన, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చడంతో పాటు పరమేశ్ రేణుకుంట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

