Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
blue drum case : బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో నిందితురాలు రస్తోగికి మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు రస్తోగి చిన్న కూతురు భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. చిన్నారికి ప్రస్తుతం 10 నెలలు మాత్రమే.
Blue Drum Case : దేశవ్యాప్తంగా మీరట్, బ్లూ డ్రమ్ మర్డర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన మృతుడు సౌరభ్ భార్య ముస్కాన్ రస్తోగికి ఇటీవలే మీరట్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆమె కూతురు, 10 నెలల చిన్నారి భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అనే నేవీ మాజీ అధికారిని అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి హత్య చేశారు.
అనంతరం అతడి మృతదేహాన్ని బ్లూ డ్రమ్‌లో ఉంచి, పైనుంచి సిమెంట్ పోసి కప్పేశారు. తర్వాత బ్లూ డ్రమ్‌ను ఇంటి పరిసరాల్లో పాతేశారు. పోలీసుల విచారణలో ఈ నేరం బయటపడింది. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు రెండు రోజుల క్రితం మీరట్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఇద్దరూ ప్రస్తుతం మీరట్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. రస్తోగికి ఇంతకుముందే ఏడేళ్ల కూతురు ఉంది. రస్తోగి జైలుకు వెళ్లడంతో ఆమె కూతురు వారి అమ్మమ్మ వారి ఇంటి వద్దే ఉంటోంది. ఆ కూతురు బాధ్యతలు వారి కుటుంబమే చూస్తోంది. రస్తోగి ఈ హత్య చేసే సమయానికి ఆమె గర్భిణి.
హత్య తర్వాత ఈ విషయం వెల్లడైంది. హత్య అనంతరం ఆమెను అరెస్టు చేసిన పోలీసులు మీరట్ జైలుకు తరలించారు. రస్తోగి జైలులో ఉన్న సమయంలోనే ఆమె పాపకు జన్మనిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో స్థానిక ఆస్పత్రిలో రస్తోగి పాపకు జన్మనిచ్చింది. అక్కడ ఆమె కోలుకున్న తర్వాత పాపతోపాటు రస్తోగిని జైలుకు తరలించారు. ప్రస్తుతం జిల్లా జైలులోనే రస్తోగి.. ఆమె చిన్నారి కూతురు ఉంటున్నారు. అక్కడ వారికి మరీ ప్రత్యేకమైన సదుపాయాలేమీ లేవు. జైలు నిబంధనల ప్రకారం తల్లికి, చిన్నారికి తగిన ఏర్పాట్లు మాత్రం ఉన్నాయి.
ఇప్పుడు రస్తోగికి మరణశిక్ష విధించిన నేపథ్యంలో చిన్నారి భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పటికిప్పుడు తల్లికి, చిన్నారికి వచ్చిన ఇబ్బందేమీ లేదని జైలు అధికారులు అంటున్నారు. ఎందుకంటే ఆమె శిక్షకు సంబంధించిన న్యాయపరమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసు విచారణ ఏడాదిలోపే పూర్తై.. శిక్ష కూడా త్వరగా ఖరారైనప్పటికీ.. పూర్తిస్థాయి శిక్ష తీర్పు వెలువడటానికి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే మీరట్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును రస్తోగి.. పై కోర్టులో సవాల్ చేయడానికి అవకాశం ఉంది. హైకోర్టు, ఆ తర్వా త సుప్రీంకోర్టు.. ఇలా అనేక స్థాయిల్లో విచారణకు అవకాశం ఉంది.
అలాగే, గవర్నర్, రాష్ట్రపతి నుంచి క్షమాభిక్షను కూడా కోరే వీలుంటుంది. ఖైదీలు తమ న్యాయపరమైన హక్కును పొందేందుకు చట్టం వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో రస్తోగికి మరణశిక్ష పడ్డప్పటికీ.. ఇది ఇప్పటికిప్పుడు అమలు కాదు. అందువల్ల ఆమె చిన్నారి కూతురు విషయంలో కూడా ఆందోళన అవసరం లేదని జైలు అధికారులు అంటున్నారు. అయితే, చిన్నారి పుట్టినప్పటి నుంచి జైలులోనే ఉండటమే ఇబ్బంది కలిగించే అంశం. జైలు నిబంధనల ప్రకారం.. ఖైదీల పిల్లలు ఆరేళ్లు వచ్చే వరకు వారి తల్లితోనే ఉండొచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

