సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
అల్పపీడనం ప్రభావంతో సోమవారం మల్కాజిగిరి ప్రాంతంలో 1.20సెం.మీలు, గండిమైసమ్మ ప్రాంతంలో 2.5మి.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా మరో పక్క నగరంలో అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గ్రేటర్లో ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.6 డిగ్రీలు, కనిష్ఠం 22.9 డిగ్రీలు, గాలిలో తేమ 72 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.