
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 11: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్, పీజీ డిప్లొమా ఇన్ జాగ్రఫికల్ కార్టోగ్రఫీ కోర్సుల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 15వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 20వ తేదీ వరకు, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంలిబ్‌ఐఎస్సీ, ఎంజే అండ్ ఎంసీ తదితర కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈనెల 20వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 25వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. మూడేండ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ ఆనర్స్, ఐదేండ్ల బీకామ్ ఎల్ఎల్బీ రెండు, అయిదో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్, ఐదేండ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేండ్ల బీబీఏ ఎల్ఎల్బీ రెండు, అయిదు, ఏడు, తొమ్మిదో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫీజును ఈనెల 27వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని పేర్కొన్నారు. రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.
బీసీఏ రీవాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోదలచిన వారు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించి ఈనెల 16లోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో ఈనెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జవాబు పత్రం నకలు పొందగోరేవారు ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి ఈనెల 16లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.