Mojtaba Khamenei | అమెరికా, ఇజ్రాయెల్‌పై చట్టపరమైన చర్యలు.. అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామన్న మొజ్తాబా ఖమేని
Mojtaba Khamenei : ఇరాన్‌పై వరుసగా దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులను అంతం చేస్తున్న ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Mojtaba Khamenei : ఇరాన్‌పై వరుసగా దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులను అంతం చేస్తున్న ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు, ఇరాన్ ప్రముఖ నేతల వరకు ఎందరో పౌరుల మరణాలకు, వారిపై జరిగిన నేరాలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమన్నారు.
వీరి మరణాలకు బాధ్యులను చేస్తూ వేలాది కేసులు ఫైల్ చేయబోతున్నట్లు ఖమేని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు. సాధారణ ప్రజల నుంచి దేశ అగ్రనాయకత్వం వరకు ఈ దాడుల్లో మరణించిన వారిని అమరులుగా అభివర్ణించారు. ఈ అంశంపై అమెరికా-జియోనిస్టులు (యూఎస్, ఇజ్రాయెల్ నేతలు) చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు తమకు ఆధారాలుగా ఉపయోగపడతాయని ఖమేని అన్నారు. దీనివల్ల అంతర్జాతీయ కోర్టులలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్ కోర్టులలో పోరాడుతుందన్నారు. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంటే.. బదులుగా ఇరాన్‌పై అమెరికా వైమానిక దళం దాడులు చేస్తోంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే, శాంతి ఒప్పందం కోసం తీసుకుంటున్న చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అమెరికా హెచ్చరిస్తోంది. అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. మరో నెల రోజులపాటు ఈ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటుందన్నారు. ఈ విషయంలో ఇతర ఏ దేశానికి అధికారం ఇవ్వబోమని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

