Infertility | సంతాన లోపం సమస్యకు మహిళలనే నిందించొద్దు.. పురుషుల్లోనూ ఈ సమస్యలు ఉంటాయి..
సంతానోత్పత్తి సమస్యలు అంటే చాలామంది ముందుగా మహిళల ఆరోగ్యాన్నే అనుమానిస్తారు. అయితే గర్భధారణ అంశం భార్యాభర్తలు ఇద్దరి ఆరోగ్యంపై ఆధారపడే ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, నిద్ర, శారీరక ఆరోగ్యం వంటి అంశాలు పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
Infertility | సంతానోత్పత్తి సమస్యలు అంటే చాలామంది ముందుగా మహిళల ఆరోగ్యాన్నే అనుమానిస్తారు. అయితే గర్భధారణ అంశం భార్యాభర్తలు ఇద్దరి ఆరోగ్యంపై ఆధారపడే ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, నిద్ర, శారీరక ఆరోగ్యం వంటి అంశాలు పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పురుషులలో జింక్ లోపం కూడా సంతానోత్పత్తికి అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సంతానలేమి సమస్యల్లో దాదాపు సగం కేసులకు పురుషుల ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతాయని చెబుతున్నారు. కాబట్టి గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మహిళల ఆరోగ్యంపైనే దృష్టి పెట్టడం సరిపోదు. పురుషుల శుక్రకణాల నాణ్యత, సంఖ్య, కదలిక కూడా సమానంగా కీలక పాత్ర పోషిస్తాయి.
జింక్ చాలా ముఖ్యం..
పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి జింక్ అత్యంత ముఖ్యమైన ఖనిజాల్లో ఒకటి. ఇది శుక్రకణాల ఉత్పత్తి, చురుకుదనం (మోటిలిటీ), అలాగే టెస్టోస్టెరోన్ హార్మోన్ ఆరోగ్యకరమైన స్థాయిలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో జింక్ తక్కువగా ఉంటే శుక్రకణాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. జింక్ లోపం కారణంగా అండోత్సర్గం సక్రమంగా జరిగినప్పటికీ గర్భధారణ అవకాశాలు తగ్గుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే సమస్య ఎప్పుడూ మహిళలవైపు మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. పురుషుల పోషకాహార లోపాలు కూడా గర్భధారణలో ఇబ్బందులకు దారితీస్తాయి.
సమతుల ఆహారం తీసుకోవాలి..
సంతానోత్పత్తిని కేవలం హార్మోన్లు, అండోత్సర్గం లేదా వైద్య చికిత్సలతో మాత్రమే ముడిపెట్టకుండా, రోజువారీ ఆహారంపైనా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారంలో జింక్ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవడం పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జింక్ అధికంగా ఉండే గుమ్మడికాయ గింజలు, నువ్వులు, శనగలు, బీన్స్, గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, మాంసం, డ్రైఫ్రూట్స్ వంటి ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన జింక్ అందుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Infertility
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

