
ఘట్కేసర్ రూరల్, నవంబర్ 14: విద్యార్థులో సృజనాత్మకతను వెలికితీయాలని, విద్య నేర్పడంలో ఆనందపడేవారే ఉత్తమ ఉపాధ్యాయులు అవుతారని జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చౌదరిగూడ పంచాయతీ జోడిమెట్లలోని శ్రీసాయివాణి గ్రామర్ స్కూలులో నారపల్లి, చౌదరిగూడ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతకు అనుగుణంగా విద్యా విధానం అమలు చేసినప్పుడే సరైనా ఫలితాలు వస్తాయన్నారు. మేధావుల ఆలోచన విధానాలు, అనేక ఉదాహరణలు బోధించాలన్నారు. సంఘాలు ఉన్నప్పుడే ఐక్యత ఉంటుందని, ప్రతిఒక్కరూ మంచిని పెంచే అవకాశం ఉంటుందని అన్నారు.
ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా పని చేసినప్పుడే ప్రతిఒక్కరూ ఉన్నతమైన స్థానాలకు ఎదుగుతారన్నారు. పిల్లలకు విద్యా బోధనతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు అలవాటు చేయడానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి, ఎంపీటీసీలు భాస్కర్‌రెడ్డి, రామారావు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యం, సలహాదారులు తిరుమల్ రెడ్డి, కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రమేశ్, కోశాధికారి రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.