AMB Cinemas | టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబుకు చెందిన AMB సినిమాస్‌తో పాటు మరో 5 థియేటర్లపై GSTAT (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్) జరిమానా విధించింది.
సినిమా టికెట్లపై కేంద్రం జీఎస్టీ (GST) తగ్గించినా.. టికెట్ గ్రాస్ రేట్ పెంచి అంతే డబ్బులు వసూలు చేశారని AMB సినిమాస్తోపాటు జ్యోతి థియేటర్, భ్రమరాంబ సినిమాస్, కుమార్ 70 MM, విశ్వనాథ్ 70 MM, ASR సినిమాస్ థియేటర్లపై జరిమానా విధించింది.
AMB సినిమాస్ మొత్తం రూ.1.7 కోట్లలో రూ.35 లక్షలు ఇప్పుడు జమ చేయాలని, జ్యోతి థియేటర్ రూ.19.8 లక్షలు, భ్రమరాంబ సినిమాస్ రూ.11.8 లక్షలు, కుమార్ 70 MM రూ.2.5 లక్షలు, ASR సినిమాస్ రూ.9.6 లక్షలు, విశ్వనాథ్ 70MM రూ.9 లక్షలతోపాటు 18% వడ్డీ కలిపి సంక్షేమ నిధికి చెల్లించాలని GSTAT ఆదేశాలు జారీ చేసింది.