బ్యాంకర్లు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ సకాలంలో అందేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు కృషి చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలువాలన్నారు. పీఎం స్వానిధి, పీఎం ఇజీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేన్కు సంబంధించిన అన్ని పథకాలు డిసెంబర్ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో భాగంగా జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ను కలెక్టర్ ప్రారంభించారు. సమావేశంలో ఆర్బీఐ అధికారి శివరామన్, నాబార్డ్ డీపీవో ప్రవీణ్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.