
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): లోటస్ హాస్పిటల్ 15 వార్షికోత్సవం సందర్భంగా అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వైద్యశాల సీఈవో డాక్టర్ ప్రసాద్, సీఎండీ డాక్టర్ హేమ ప్రసాద్ గురువారం తెలిపారు. నవంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు అన్ని విభాగాల్లో డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని రకాల వైద్యసేవల్లో 15 శాతం రాయితీతో (రక్త పరీక్షలు, ఫార్మసీ, రేడియాలజీ, ఇన్ పేషెంట్) కూడిన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.