సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆటో ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులతో ఆటో డ్రైవర్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిల పడ్డ చందంగా మారింది.
మొన్నటి వరకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి కుటుం బాన్ని పోషించలేక, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కండ్ల ముందే కనిపిస్తున్నా సర్కార్ మాత్రం పట్టించు కోవడం లేదు. ఏడాదికి రూ.12వేలు ఇస్తామని మాటిచ్చి ఇప్పటికీ 3 ఏండ్లు గడిచినా ప్రయోజనం లేదు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటును పట్టించుకో లేదు. తాజాగా ఆటో ఛార్జీల పెంపు ముసుగులో మళ్లీ ఆటో డ్రైవర్లపై భారం మోపడానికి రెడీ అయిపోయిందంటూ బీఎంఎస్ ఆటో యూనియన్, బీఆ ర్టీయూ ట్యాక్సీ యూనియన్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇప్ప టికే ఓల, ఉబర్, ర్యాపిడోలో ఆటోడ్రైవర్లు క్రియాశీలకంగా ఉన్నారు. అందు లోని అగ్రిగేటర్లు ధరలు పెంచితే సరిపోతుంది. ప్రయాణం అంతా యాప్ ఆధారితంగానే సాగుతున్న దరిమిలా డ్రైవర్లకు లాభం చేకూరేది. కానీ ఇప్పుడు యాప్ ఆధారిత ప్రయాణంతో సంబంధం లేకుండా కేవలం ఆటో మీటర్ ఛార్జీలు పెంచడం అనేది ఆటో డ్రైవర్లపై భారం మోపడమే అవుతుం దని బీఎంస్, బీఆర్ టీయూ ట్యాక్సీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఆటోలో డిజిటల్ మీటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని అందుకోసం రూ. 10వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఆ డబ్బులు ఆటో డ్రైవర్లపై భారం మోపడమేనని పేర్కొన్నారు. ఛార్జీల పెంపును తాము వ్యతి రేకిస్తున్నట్టు బీఎంఎస్ ప్రకటించింది. 3 రోజులు పాటు జీవో ప్రతులను దహనం చేసే కార్యక్రమం తీసుకున్నామంటూ ప్రకటించింది.
ఇప్పటికీ ఆటో డ్రైవర్లు ఏదో తమకు వచ్చిన గిరా కీతో బతుకుతున్నారు. ఇప్పుడు ఆటోలో మీటర్ల బిగింపు అనివార్యంగా మారడంతో వాళ్లు అందుకోసం రూ.10వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పు డున్న పరిస్థితుల్లో ఆ భారం వారు మోయగలరా? కొన్ని ఆటో సంఘాల జేఏసీ నాయకులు వారి స్వలాభం కోసం ఆటో మీటర్ల ఛార్జీల పెంపును తెరమీ దకు తీసుకొచ్చాయని బీఎంఎస్, బీఆర్టీయూ ట్యాక్సీ అసోసియేషన్ ఆరోపించాయి. మీటర్ల బిగింపు టెండర్లు ఎవ్వరికి కట్టబెడుతారు? మరోవైపు కొందరు జేఏసీ నాయకులు సాధారణ ఆటో డ్రైవర్లందరితో టచ్ ఉండి వారికి మీటర్ల బిగింపు చేయిస్తామని ద ళారుల అవతారమెత్తుతారు. ఒక్కో ఆటోపై వారి కమీ షన్ వసూలు చేస్తారు. ఇలా కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్ల నుంచి వసూలు చేసే కుట్ర జరుగుతుందని తెలి పారు. ప్రభుత్వమే ఆటో మీటర్లను ఉచితంగా ఏర్పా టు చేయాలని, వాహనాలకు మీటర్లు లేవని కేసులు రాయొద్దని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఉచిత బస్సుతో నష్టపోతారని ప్రభుత్వం ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ప్రకటించింది. మూడేండ్లకు రూ. 9,600 కోట్ల వరకు అవుతుంది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఆటో డ్రైవర్లకు ఇవ్వలేదు. ఉచిత బస్సుతో 250 మందికి పైగా ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాలను కూడా ప్రభుత్వం పట్టిం చుకోలేదని ఆటో సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దయనీయ పరిస్థి తుల్లో ఆటో డ్రైవర్లు ఉంటే వీరిపైన పైసలు ఏరుకునే కుటిల రాజకీయాలు కొన్ని సంఘాలు, రాజకీయ ముసుగులు చేస్తున్నాయని బీఎంఎస్, బీఆర్టీయూ ట్యాక్సీ అసోసియేషన్ ఆరోపించింది. మ్యానిఫె స్టోలో కాంగ్రెస్ హామిచ్చినట్టుగా ఏడాదికి రూ.12వేలు ప్రతి ఆటోడ్రైవర్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం నుంచి ఆటో డ్రైవర్లను డైవర్ట్ చేయడానికే జేఏసీ నాయకులు తమ స్వలాభం కోసం రోజుకో నాటకం వేస్తున్నారని విమర్శిస్తున్నారు.