మెహిదీపట్నం, జూన్ 9 : నాంపల్లి నియోజకవర్గం దత్తాత్రేయనగర్ కాలనీలో గురువారం ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్ పర్యటించారు. కార్పొరేటర్ జాకీర్ బాక్రీ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనులను అందించడానికి అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్ ఆదేశించారు.
నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్‌నగర్ డివిజన్ గుడిమల్కాపూర్ మందులగూడలో గురువారం జీహెచ్ఎంసీ అధికారులు పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరిశుభ్రత పనులను చేపట్టారు. ఈ పనులను ఆసిఫ్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెన్నబత్ని లక్ష్మీనారాయణ(చిన్న), నాయకులు మహేందర్‌లు పర్యవేక్షించారు.
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధిని చేపడుతున్నాం అని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అన్నారు. గురువారం టోలిచౌకి, నానల్‌నగర్ డివిజన్లలో ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్,నానల్‌నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్‌తో కలిసి పర్యటించారు.
కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకి డివిజన్లో గురువారం పట్టణ ప్రగతిలో భాగంగా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు బస్తీల్లో, కాలనీల్లో శానిటైజేషన్ పనులను చేపట్టారు. ఈ పనులను ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ ఆదేశాలతో ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి మహ్మద్ హరూన్ ఫర్హాన్ పర్యవేక్షించారు.