Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
Robot Harassment | తాజాగా జర్మనీలో ఓ హ్యూమనాయిడ్ రోబో 16 ఏళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. కొలోన్ నగరంలోని వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న టీజేజీ అమ్మాయిల వద్దకు వచ్చిన ఆ రోబో.. ఒకరిని హగ్ చేసుకుని అసభ్యంగా తాకింది.
Robot Harassment | మహిళలకు మగవారి నుంచే కాదు.. ఇప్పుడు రోబోల వల్ల కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు! తాజాగా జర్మనీలో ఓ హ్యూమనాయిడ్ రోబో 16 ఏళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. కొలోన్ నగరంలోని వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న టీజేజీ అమ్మాయిల వద్దకు వచ్చిన ఆ రోబో.. ఒకరిని హగ్ చేసుకుని అసభ్యంగా తాకింది.
ఊహించని ఈ ఘటనతో సదరు టీనేజర్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోబోను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. ఈ ఘటనను సోషల్ మీడియాలో లైవ్‌లో ప్రసారం చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
జర్మనీలోని కొలోన్ నగరంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 16 ఏళ్ల బాలికను ఓ రోబోట్ వెనుక భాగంలో తాకినట్లు, ఆమె వైపు అసభ్యకరమైన లైంగిక సంజ్ఞలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రోబోట్ ఇద్దరు యువకులు నియంత్రిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో రోబో యజమానిగా భావిస్తున్న 16 ఏళ్ల బాలుడు, అతని స్నేహితుడైన 19 ఏళ్ల యువకుడు ఉద్దేశపూర్వకంగానే రోబోతో తప్పుడు పనిచేయించి ఉంటారని అనుమానిస్తున్నారు. తమ వద్ద ఉన్న హ్యూమనాయిడ్ రోబోను వీధుల్లో వెళ్లే మహిళల దగ్గరకు పంపించి వారిని అసభ్యంగా తాకించడం, అసభ్య సంజ్ఞలు చేయించడంతో పాటు, వాటిని లైవ్‌లో టెలికాస్ట్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
‼️BREAKING: German police seized a robot that sexually assaulted a 16-year-old girl by touching her ass and making thrusting motions at her.
Officers found it stashed in the boot of a Volkswagen.
Its 16-year-old owner and a 19-year-old companion allegedly livestreamed it. https://t.co/MTUBuXcgtT
— International Cyber Digest (@IntCyberDigest) October 12, 2026
ఇద్దరు అనుమానితుల నుంచి పోలీసులు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రోబో కదలికలు ముందుగానే ప్రోగ్రామ్ చేశారా? లేక యువకులు రిమోట్ ద్వారా అప్పటికప్పుడు నియంత్రించారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాలు వెలుగులోకి వస్తే ఘటనలో ఎవరి పాత్ర ఎంత ఉందో, వర్తించే చట్టపరమైన చర్యలు ఏమిటో నిర్ణయించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులపై ఇంకా అభియోగాలు నమోదు చేయలేదని, అయితే వారిని అనుమానితులుగా పరిగణిస్తున్నామని కొలోన్ పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనను గతంలో ఎదుర్కోలేదని, ఇది తమకు కొత్త పరిణామమని పోలీసు ప్రతినిధి క్రిస్టోఫ్ బెర్మెల్ పేర్కొన్నట్లు ఏపీ వెల్లడించింది. మరోవైపు, ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వ్యాఖ్యలపైనా పోలీసులు స్పందించారు. బాధితులను కించపరిచేలా వ్యాఖ్యానించడం, ఘటనను వినోదంగా చూడటం, వీడియోలను బాధ్యతారహితంగా పంచుకోవడం బాధితులపై మరింత ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

