మరోసారి పెట్రోల్ ధరల పెంపు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందంటే?
మరోసారి పెట్రోల్ ధరల పెంపు | దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. శుక్రవారం లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో శనివారం

న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. శనివారం లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో లీటర్ పెట్రోల్ ధర రూ.98.11కు చేరగా.. డీజిల్ రూ.88.65కు పెరిగింది. మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 31వ సారి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.7.79, డీజిల్‌పై 7.87 వరకు చమరు కంపెనీలు పెంచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.104 దాటింది. లీటర్ పెట్రోల్ ధర రూ.10.22కు పెరగ్గా.. డీజిల్ రూ.96.16కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.102కు చేరువైంది. ప్రస్తుతం ధర రూ.101.96కు పెరిగింది.
మరో వైపు అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 109.30 చేరగా.. డీజిల్ రూ.101.85కు చేరింది. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు డిమాండ్ పెరగ్గా.. మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం బ్రెంట్ ముడి ధర బ్యారెల్‌కు 76 డాలర్లు దాటింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బ్రెంట్ 0.62 డాలర్లు పెరిగి.. యూఎస్ మార్కెట్లో బ్యారెల్‌కు 76.18 డాలర్లకు చేరింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 0.75 డాలర్లు పెరిగి.. బ్యారెల్‌కు 74.05 డాలర్లు పలికింది.
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు
ఢిల్లీలో పెట్రోల్ రూ.98.11.. డీజిల్ రూ.88.65
ముంబైలో పెట్రోల్ రూ.104.22.. డీజిల్ రూ.96.16
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.101.96.. డీజిల్ రూ.96.63
చెన్నైలో పెట్రోల్ రూ.99.18.. డీజిల్ రూ.93.22
కోల్‌కతాలో పెట్రోల్ రూ.97.99, డీజిల్ రూ.91.49
విజయవాడలో పెట్రోల్ రూ.104.31, డీజిల్ రూ.98.38
భోపాల్‌లో పెట్రోల్ రూ.106.35.. డీజిల్ రూ.97.37
బెంగళూరులో పెట్రోల్ రూ.101.39, డీజిల్ రూ.93.98
పాట్నాలో పెట్రోల్ రూ.100.13.. డీజిల్ రూ.94
చండీగఢ్‌లో పెట్రోల్ రూ.94.35, డీజిల్ రూ.88.29
లక్నోలో పెట్రోల్ రూ.95.29, డీజిల్ రూ.89.06
రాంచీలో పెట్రోల్ రూ.93.82, డీజిల్ రూ.93.57
ఇవి కూడా చదవండి..
నిద్ర సరిగ్గా పట్టట్లేదా ? కంటి చూపు దెబ్బతినొచ్చు జాగ్రత్త !
కూరలో కరివేపాకును తీసిపారేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు
జూలై 5 వరకు లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే?
జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారికి 22.5 ఏళ్ల జైలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

