ఎక్సలెన్స్ మెడల్స్ ప్రకటించిన హోంశాఖ.. తెలంగాణ నుంచి ఐదుగురికి..
ఎక్సలెన్స్ మెడల్స్ ప్రకటించిన హోంశాఖ.. తెలంగాణ నుంచి ఐదుగురికి.. | కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ఎక్సలెన్స్ మెడల్స్‌ను ప్రకటించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 125 మంది పోలీస్ సిబ్బందికి మెడల్స్ ప్రదానం చేయనుంది. ఇందులో సీబీఐతో పాటు ఎన్ఐఏ, ఎన్సీబీ సిబ్బందిని సైతం ఎంపిక చేసింది. అలాగే 28 మహిళా

హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ఎక్సలెన్స్ మెడల్స్‌ను ప్రకటించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 152 మంది పోలీస్ సిబ్బందికి మెడల్స్ ప్రదానం చేయనుంది. ఇందులో సీబీఐతో పాటు ఎన్ఐఏ, ఎన్సీబీ సిబ్బందిని సైతం ఎంపిక చేసింది. అలాగే 28 మహిళా పోలీసులు సైతం ఉన్నారు. నేర పరిశోధనలో అత్యుత్తమంగా ప్రతిభ చూపిన వారికి ‘యూనియన్ హోంమినిష్టర్స్ మెడల్స్’ ఇస్తున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి అత్యధికంగా 11 మంది చొప్పున, యూపీలో 10 మందికి, కేరళ, రాజస్థాన్ నుంచి తొమ్మిది మంది చొప్పున, తమిళనాడులో 8 మందికి, బిహార్ నుంచి ఏడుగురికి, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ నుంచి ఆరుగురు పోలీసులను ఎక్సలెన్స్ మెడల్స్ వరించాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి ఐదుగురు చొప్పున పోలీసులు మోడల్స్‌కు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఎక్సలెన్స్ అవార్డులను అందిస్తోంది.
నేర పరిశోధనలో అసాధారణ పత్రిభ చూపిన పోలీసులను ప్రోత్సహించేందుకు ఐదు రకాల పతకాలను అందజేస్తోంది. వీటిలో ‘స్పెషల్ ఆపరేషన్స్ మెడల్, పోలీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్ మెడల్, ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్ మెడల్, ఉత్కృష్ట్ సేవ మెడల్, ఇన్వెస్టిగేషన్లో మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఇస్తూ వస్తోంది. 2020లో 121 మంది ‘మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్’కు ఎంపికయ్యారు.
తెలంగాణ నుంచి ఐదుగురికి..
‘మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్’కు తెలంగాణ నుంచి ఐదుగురు పోలీసులు ఎంపికయ్యారు. ఇందులో నాయిని భుజంగరావు (ఏసీపీ), ఏ మధుసూదన్ (డెప్యూటీ ఎస్పీ), ఎన్ శ్యామ్ ప్రసాద్‌రావు (ఏసీపీ), జీ శ్యామ్ సుందర్ (ఏసీపీ), నెనావత్ నగేశ్ (ఎస్ఐ) ఎంపికయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
KTR | ఒకాయన అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా అని ఎదురు చేస్తాడు..! ఇంకొకాయన బాడీ గార్డులా మారిపోతాడు
KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
Boyfriend Stabs Girl | ఇతర అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. యువతిని చంపిన ప్రియుడు
Bomb Threat | హైదరాబాద్‌లో బాంబులు పేలుస్తాం.. పోలీసులకు బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

