పర్యాటక రంగం సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పర్యాటక రంగం సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ | రాష్ట్రంలో పర్యాటక రంగం సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో పర్యాటక రంగం సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని నివాసంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని (సెప్టెంబర్ 27) పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా టూరిజం పాలసీ రూపకల్పనపై ప్రతిపాదనలు రూపొందించి.. సీఎం కేసీఆర్‌కు అందజేయాలని ఆదేశించారు.
వీటితో పాటు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శాఖ ఆధ్వర్యంలో విశిష్ట సేవలందిస్తున్న భాగస్వాములను ప్రోత్సహించేందుకు ఏటా ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. గతేడాది కరోనా నేపథ్యంలో అవార్డులను వర్చువల్ విధానంలో అందజేసినట్లు చెప్పారు. ఈ ఏడాది 16 విభాగాల్లో 19 పర్యాటక శాఖ అనుబంధ భాగస్వాములకు ఎక్సలెన్స్ అవార్డులను, కొవిడ్ సమయంలో పర్యాటక శాఖ ఉద్యోగులకు వందే భారత్ మిషన్‌లో భాగంగా విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రత్యేక అవార్డులను మంత్రి.. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజుతో కలిసి ప్రకటించారు.
సీఎం కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టంగా యునెస్కో గుర్తించిందని, రాష్ట్రంలో ఎన్నో వారసత్వ, ప్రాచీన చరిత్ర కలిగిన కట్టడాలున్నాయన్నారు. వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, చార్మినార్‌ను ప్రపంచవారసత్వ కట్టడాలుగా గుర్తింపు కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎక్స్క్యూటివ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టూరిజం అధికారులు మహేశ్, ఓం ప్రకాశ్, శశిధర్, అంజిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

