భర్త హత్య కేసులో యావజ్జీవ శిక్ష సబబే
నిత్యం మద్యం సేవించి, వేధిస్తున్నాడన్న కారణంతో నిద్రిస్తున్న భర్తను హత్యచేసిన అగురాల లక్ష్మి అలియాస్ గౌరికి 2018లో ఆదిలాబాద్ జిల్లా కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను తాజాగా హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో నేరాన్ని నిరూపించేందుకు ప్రత్యక్ష సాక్షులు తప్పనిసరి కాదని, ఆ నేరానికి సంబంధించిన గొలుసుకట్టు ఆధారాలు ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది.
- భార్య అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): నిత్యం మద్యం సేవించి, వేధిస్తున్నాడన్న కారణంతో నిద్రిస్తున్న భర్తను హత్యచేసిన అగురాల లక్ష్మి అలియాస్ గౌరికి 2018లో ఆదిలాబాద్ జిల్లా కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను తాజాగా హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో నేరాన్ని నిరూపించేందుకు ప్రత్యక్ష సాక్షులు తప్పనిసరి కాదని, ఆ నేరానికి సంబంధించిన గొలుసుకట్టు ఆధారాలు ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. నిందితురాలికి పిల్లలు ఉన్నారన్న కారణంతో శిక్ష విధింపులో కింది కోర్టు ఉదారంగా వ్యవహరించకపోవడం సరైనదేనని పేర్కొంటూ.. ఆమె అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసులో లక్ష్మికి ఈ ఏడాది జూన్ 1న ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

