ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు వారెంట్లు.. 7న కోర్టులో హాజరుపర్చాలని రిజిస్ట్రీకి ఆదేశం
కోర్టు ధికరణ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించకపోవడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌లకు హైకోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికరణ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించకపోవడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌లకు హైకోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 7న వారు కోర్టుకు హాజరయ్యేలా వారెంట్లు అమలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. భూసేకరణ పరిహారానికి సంబంధించిన కేసులో కింది కోర్టు నిర్ణయించిన మొత్తంలో 50% సొమ్మును 3 నెలల్లోగా డిపాజిట్ చేయాలని నిరుడు ఏప్రిల్ 24న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ ఆదేశాలు అమలు కాలేదంటూ జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన నాగిరెడ్డి, మరొకరు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలు చేయడంతో నిరుడు ఆగస్టు 22న సందీప్‌కుమార్ సుల్తానియా, వికాస్‌రాజ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ పరిహారం సొమ్మును డిపాజిట్ చేయకపోవడంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని, కోర్టు ధికరణ నేరం కింద ఎందుకు చర్యలు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ వారికి ఫారం-1 నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కూడా వారు విచారణకు హాజరు కాకపోవడంతో బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

