Sai Dharam Tej | జనసేన అధినేత పవన్ కల్యాణ్ (PawanKalyan) ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయగా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. ఏపీ చరిత్రలోనే ఇది భారీ మెజార్టీ కాగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇక జనసేన అధినేత పవన కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేసి ఘన విజయం సాధించాడు. రీసెంట్గా ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో అతని అల్లుడు సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నాడు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్ తేజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో కాలినడకన తిరుమలకు వెళ్లాడు సాయి ధరమ్ తేజ్. ఇక అలిపిరి నుంచి సాయి తేజ్ తిరుమలకు వెళుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పవన్ కళ్యాణ్ గెలవడంతో కాలినడకన తిరుమలకు వెళ్లిన హీరో సాయి ధరమ్ తేజ్
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్.. కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్ళాడు. pic.twitter.com/TLSC2aeZkc
— Telugu Scribe (@TeluguScribe) June 15, 2024