ఇమ్మ్యూనిటీ బూస్టర్ :వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన దుంప..

హైదరాబాద్,జూలై : వర్షా కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను పరిష్కరించడంలో చిలగడదుంప ఎంతో బాగా ఉపకరిస్తుంది. మంచి ఇమ్మ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల పలు రుగ్మతలకు దూరంగా ఉండొచ్చు.
ఈ వర్షాకాలంలో చిలకడ దుంపలు తినడంవల్లఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ “ఏ”,”సీ”,మాంగనీస్, విటమిన్ “బీ6”, పొటాషియం,పాంటోథెనిక్ యాసిడ్,కాపర్,నియాసిన్ వంటి వి చిలగడదుంపలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి. అంతేకాదు వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ కణాలతో పోరాడగలుగుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలి.
ఈ దుంపల్లో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లలో కాంతిని గ్రహించే రిసెప్టర్లు తయారయ్యేలా చేస్తుంది. దాని వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఈ కాలంలో విరివిగా దొరికే చిలకడ దుంపలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఎందుకంటే ఆ తొక్కలో కూడా కాన్సర్‌ను అడ్డుకునే గుణాలు ఉంటాయట. ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. చిలకడ దుంపల్లో అది బోలెడంత ఉంటుంది. వీటిలోని విటమిన్ “ఏ” వ్యాధినిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అంతేకాదు మధుమేహ బాధితులకు చిలగడ దుంపలు ఓ వరం లాంటివి. ఇవి బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచుతాయి.
చిలగడ దుంపలకు తీసుకోవడం మంచిది. చిలగడ దుంపలలో ఉండే అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్ క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇవి మన శరీరంలోని కండరాలు, నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్నివ్వడం ద్వారా ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

