Heavy Rains : 19, 20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
రాష్ట్రంలో ఈనెల 19, 20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 19, 20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. 20న కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13 జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానుపల్లి మండలం రవీంద్ర నగర్లో 2.78, అదిలాబాద్ జిల్లా సిరికొండ 1.88, నార్నూర్ 1.63, జైనథ్ 1.55 సెంట మీటర్ల వర్షం నమోదైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

