న్యూయార్క్: గుండె చప్పుడును వినే సరికొత్త చొక్కాను రూపొందించారు శాస్త్రవేత్తలు. ఇది హృదయ స్పందనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అమెరికాలోని ఎంఐటీ, రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్‌కి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ వస్ర్తాన్ని అభివృద్ధి చేశారు. ఇది మైక్రోఫోన్ మాదిరిగా పనిచేస్తుంది. గుండెశబ్దాన్ని మెకానికల్ వైబ్రేషన్స్‌గా, అనంతరంగా ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌గా మారుస్తుంది. అలాగే శ్వాసప్రక్రియను కూడా పర్యవేక్షిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.