HomeNewsHealthy Breakfast Tips Should Not Eat These Foods In Morning
Healthy Breakfast | పరిగడుపున వీటిని అస్సలు తినకండి
eating-food
2/6
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ అనగానే చాలామంది ఇడ్లీ, దోశ, వడ.. ఇలా రకరకాల టిఫిన్లు చేసుకుని తింటుంటారు. కొందరైతే కేకులు, చక్కెరతో చేసిన ఆహారపదార్థాలు తింటుంటారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పరిగడుపున తియ్యటి వస్తువులు తినడం వల్ల అజీర్తి సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. అందుకే వాటికి దూరంగా ఉండాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇవే కాదు ఉదయాన్నే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
3/6
ముఖ్యంగా ఉదయంపూట అదీ పరిగడుపున సిట్రస్‌పండ్లను తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల అల్సర్, గ్యాస్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు.
4/6
ఉదయంపూట ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఉప్పు, కారం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు.
5/6
ఆయిల్‌ఫుడ్ తీసుకుంటే కడుపులో గ్యాస్‌ఫామ్ అవుతుంది. నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే ఛాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది.
6/6
కార్బోహైడ్రేట్లు ఉన్న పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. సోడా, కూల్‌డ్రింక్స్‌ను ఉదయం పూట తీసుకోకూడదు. ఇకపోతే టమాటాలను కూడా పరిగడుపున తినకూడదు. ఇందులో టానిక్ యాసిడ్ ఉండడంతో పరిగడుపున తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.