కేసీఆర్‌ది భూ రక్షణ.. రేవంత్‌ది భూ భక్షణ!
మియాపూర్, భూపాలపల్లి, హయత్‌నగర్ భూముల విషయంలో సీఎం రేవంత్పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్ మండిపడ్డారు.
- కేసీఆర్‌ది భూ రక్షణ.. రేవంత్‌ది భూ భక్షణ!
- మియాపూర్, హయత్‌నగర్, భూపాలపల్లి భూములపై సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు: హరీశ్
- ‘మియాపూర్’ భూముల వ్యవహారంలో విజయం కేసీఆర్ సర్కార్‌దే
- గతంలో బీఆర్ఎస్ హయాంలో సుప్రీంకోర్టులో 86 సార్లు వాదనలు
- రేవంత్ పాలనలో 11 సార్లే వాదనలు
- కోర్టుల్లో కొట్లాడి కాపాడింది బీఆరెస్సే
- తానే రక్షించినట్టు సీఎం ‘క్రెడిట్ చోరీ’
- బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు సిగ్గుచేటు
- తీర్పు వచ్చిన వెంటనే భూముల బేరం
- అబద్ధాలకు సీఎం బ్రాండ్ అంబాసిడర్
- సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : మియాపూర్, భూపాలపల్లి, హయత్‌నగర్ భూముల విషయంలో సీఎం రేవంత్పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను త ప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు వ్యవహారంలో ‘వంటంతా మేం వం డితే.. గరిట తిప్పి నేనే వండిన అంటున్నడు. తీర్పునిచ్చిన జడ్జి సంతకం తడారకముందే, జడ్జిమెంట్ కాపీ రాకముందే, మియాపూర్ భూములను అమ్మకానికి పెట్టిండు’ అని విరుచుకుపడ్డారు.
‘కేసీఆర్‌ది భూ రక్షణ అయితే.. రేవంత్‌రెడ్డిది భూ భక్షణ’ అని నిప్పులు చెరిగారు. శనివారం తెలంగాణ భవన్లో విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్, ఎమ్మెల్సీ దా సోజు శ్రవణ్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, అభిలాష్ రంగినేని, తుంగ బాలుతో కలిసి విలేకరులతో హరీశ్ మీడియాతో మాట్లాడా రు. భూములను కాపాడేందుకు కేసీఆర్ సర్కా ర్ చేసిన ప్రయత్నాలు, కోర్టుల్లో వినిపించిన వాదనలను ఆధారాలు చూపి వివరించారు.
బయటపెట్టింది ‘నమస్తే తెలంగాణ’.. కాపాడింది కేసీఆర్
మియాపూర్ భూముల విషయంలో డాక్టర్ ప్రసాద్‌తో బీఆర్ఎస్ కుమ్మక్కయిందని, భూ ములమ్మి డబ్బులు తీసుకున్నదని రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని హరీశ్ మండిపడ్డారు. కానీ ప్రసాద్‌కు చెందిన భూముల వ్యవహారాన్ని మొదట బయపెట్టింది ‘నమస్తే తెలంగాణ’ అని స్పష్టంచేశారు. దీనిపై కేసీఆర్ వెంట నే స్పందించి సీఐడీ విచారణకు ఆదేశించారని, ఇద్దరు సబ్రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో ప్రసాద్ అన్నతోసహా పార్థసారథి, పీవీఎస్ శర్మ, శ్రీనివాస్‌రావును అరెస్ట్ చేసి జైలుకు పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.
ఈ భూముల కు సంబంధించి లాయర్ వైద్యనాథన్‌ను ని యమించి, డాక్టర్ ప్రసాద్‌కు చెందిన ట్రినిట్రి కంపెనీపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కొట్లాడి గెలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కూడా గతంలో కేసీఆర్ సర్కార్ తెచ్చిన ఆర్డర్ ఆధారంగానేనని గుర్తుచేశారు. ‘23 సం వత్సరాలుగా జరుగుతున్న ఈ కేసులో రాష్ట్రం ఏర్పడకముందు దాదాపు 86 సార్లు సుప్రీంకోర్టులో ఈ కేసు హియరింగ్‌కు వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 95 సార్లు హియరింగ్‌కు వచ్చింది. 10-07-2017న జరిగిన హియరింగ్‌కు సీఎస్ వైద్యనాథన్ హాజరయ్యారు. 6-03-2019న, 14-03-2019 న ఇలా 86 సార్లు హియరింగ్‌కు సీఎస్ వైద్యనాథన్ హాజరయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించి ఈ కేసును తుది దశకు తెచ్చారు. కేవలం తీర్పు మాత్రమే మిగిలి ఉన్నది’ అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయంతోనే ‘జాగీర్ అబాలిషన్ యాక్ట్-2016’కు చట్టబద్ధత కల్పిస్తూ జూన్ 1, 2016 నాడు జీవో 45ను జారీ చేశామని గుర్తుచేశారు. దీని ఆధారంగానే ప్రసాద్‌కు చెందిన భూములను ప్రభుత్వం పరం చేయగలిగామని, ఆ తర్వాత ట్రినిట్రి జడ్జిమెట్ ఆధారంగా సుప్రీంకోర్టులో 86 సార్లు వాదనలు వినిపించి మియాపూర్ కేసును తుదిదశకు తీసుకొచ్చామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మూడేండ్లలో కేవలం 11 వాదనలు మాత్రమే జరిగాయన్నారు. ఈ పోలికను చూస్తే రెండు ప్రభుత్వాల నిబద్ధత అర్థమవుతున్నదని స్పష్టంచేశారు.
భూపాలపల్లి భూముల రక్షణపై దృష్టి
భూపాలపల్లి పరిధిలోని విలువైన 106 ఎకరాల అటవీ భూముల వివాదం దాదాపు నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్నదని హరీశ్‌రావు తెలిపారు. 1985లోనే మొదలైన ఈ వివాదం 1994లో హైకోర్టుకు చేరిందన్నారు. 1994 నుంచి 2014 వరకు సుమారు 20 ఏండ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విస్తారమైన అటవీ సంపదను కాపాడేందుకు ఎ లాం టి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. పక్కా ఆధారాలతో పోరాడటం వల్ల 2018లో హైకోర్టు సింగిల్ బెంచ్‌లో అనుకూల తీర్పు సాధించిందని చెప్పారు. 2021 మార్చి 19న హైకోర్టు డివిజన్ బెంచ్ మహమ్మద్ అబ్దుల్ కాసిం అనే ప్రైవేట్ వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.
ఆ తీర్పు వచ్చిన వెంటనే చట్టబద్ధమైన నిబంధనలను పాటించకుండా అక్రమారులు ఏకపక్షంగా భూపాలపల్లిలోని ఆ 106 ఎకరాల భూమిలోకి ప్రవేశించి, భారీ యంత్రాలతో నిర్మాణ పనులు మొదలుపెట్టారన్నారు. ఈ ఆక్రమణలపై కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఫారెస్ట్, రెవెన్యూ చట్టాల ఉల్లంఘనలతోపాటు క్రిమినల్ ట్రెస్పాసింగ్ కేసులు నమోదు చేయించిందని తెలిపారు. మూడు జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రైలర్లను సీజ్ చేయడంతోపాటు రఘుపతిరెడ్డి, తిరుపతి నా యక్, ప్రవీణ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపామ ని చెప్పారు. ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకే వదిలేసే ఆలోచన ఉంటే, వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు ఎందుకు పంపుతుందో రేవంత్ సమాధానం చెప్పాలని నిలదీశారు.
రేవంత్‌రెడ్డి క్రెడిట్ చోరీ
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వచ్చిన ఒక నెల వ్యవధిలోనే, అంటే 2021 మేలో బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ 6937/2021) దాఖలు చేసిందని హరీశ్ పేరొన్నారు. సీనియర్ న్యా యవాది సీఎస్ వైద్యనాథన్‌ను నియమించి, 2021 నుంచి 2024 వరకు మూడేండ్లపాటు సుప్రీంకోర్టులో రాజీలేని పోరాటం సాగించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చిన మూడు నెలలకే, 2024 ఏప్రిల్ 18న సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిందన్నారు. రేవంత్‌రెడ్డి అంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం పచ్చి ‘క్రెడిట్ చోరీ’ అని దుయ్యబట్టారు.
ఆ పాపంలో రేవంత్ వాటా
ఐఎంజీ భారత్ భూముల కుంభకోణాన్ని హరీశ్ ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు, శంషాబాద్ మామిడిపల్లిలోని 450 ఎకరాలు కలిపి మొత్తం 850 ఎకరాల విలువైన భూమిని ఎక రా కేవలం రూ.50 వేల చొప్పున ఐఎంజీ బిల్లీరావుకు కట్టబెట్టింది ఎవరో చెప్పాలని నిలదీశారు. నాటి సీఎం చంద్రబాబు ఆ పాపానికి ఒడిగడితే, అదే టీడీపీ ముఠాలో రేవంత్‌రెడ్డి కూడా క్రియాశీలక భాగస్వామిగా లేరా? అని ప్రశ్నించారు.
రాష్ట్రం సిద్ధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 850 ఎకరాల్లో ఒక గుంట కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించామని చెప్పారు. ప్రముఖ న్యాయవాదులతో తొమ్మిదేండ్లపాటు హైకోర్టులో న్యాయపోరాటం జరిపి కేసును తుది దశకు చేర్చింది ము మ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమేనని వివరించారు. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలలకే, అంటే 2024 మార్చి 7న ఐఎంజీ కేసులో హైకోర్టు తుది తీర్పు వెలువడిందని పేరొన్నారు. అప్పటికి రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రి ఎవరో కూడా తెలియని అయోమయ పరిస్థితులున్నాయన్నారు.
కంచ గచ్చిబౌలిలో పర్యావరణ విధ్వంసం
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్ర ల్ యూనివర్సిటీ భూమిని కేసీఆర్ ప్రభుత్వం కాపాడి పచ్చటి చెట్లతో అభివృద్ధి చేస్తే, రేవంత్ రెడ్డి రాగానే బుల్డోజర్లను పంపి చెట్లు నరికిం చి, అకడున్న మూగజీవాలను చెల్లాచెదురు చేశారని హరీశ్ మండిపడ్డారు. ఈ అనాలోచిత చర్యలపై సుప్రీంకోర్టు, పర్యావరణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశాయని గుర్తుచేశారు.
ఆ భూములను నేరుగా విక్రయించడం సాధ్యం కాక రేవంత్ ప్రభుత్వం తీవ్ర కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. యూనివర్సిటీ విద్యార్థులు, అధికారులకు సమాచారం లేకుండా, దొడ్డిదారిన భూమిని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో కుదువపెట్టి భారీ వడ్డీకి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకువచ్చారని మండిపడ్డారు. ఇందుకు ముం బైకి చెందిన ఓ ప్రైవేట్ ఫైనాన్షియల్ బ్రోకర్‌కు ఏకంగా రూ.400 కోట్ల లంచాన్ని కమిషన్ రూపంలో ముట్టజెప్పారని ఆరోపించారు. రూ.వేల కోట్ల విలువైన వర్సిటీ భూ ములను కాపాడింది తామైతే, బ్రోకర్లకు రూ.వందల కోట్ల లంచాలిచ్చి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి, ఆ డబ్బుతో రేవంత్ సర్కార్ షోకులు చేస్తున్నదని ధ్వజమెత్తారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి
ప్రభుత్వ పరిధిలోని హౌసింగ్ బోర్డు, హెచ్ఎండీఏ, టీజీఐఐసీలతోపాటు ఎకడ ప్రభు త్వ భూమి కనిపిస్తే అకడ అమ్ముకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక ఎజెండాగా మారిందని హరీశ్ విమర్శించారు. మీడియా హెడ్లైన్లు, బ్రేకింగ్ న్యూస్‌ల కోసం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా అబద్ధాలు చెప్తే అవి నిజాలు కావని, తాము ఆధారాలతో సహా బయటపెట్టిన ఈ అక్రమాలపై దమ్ముంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
సాహెబ్‌నగర్ అటవీ భూములపై నిరంతర న్యాయపోరాటం
హయత్‌నగర్ మండలం సాహెబ్ నగర్ పరిధిలోని విలువైన అటవీ భూముల పరిరక్షణలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించిందని హరీశ్ స్పష్టంచేశారు. గతంలో హైకోర్టులో ప్రభుత్వానికి ప్రతికూలంగా తీర్పు వచ్చినప్పుడు, ఎకడా రాజీ పడకుండా తక్షణమే సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ దాఖలు చేశామని వివరించారు.
ప్రభుత్వానికి దురుద్దేశం ఉంటే హైకోర్టు తీర్పు రాగానే మిన్నకుండిపోయేదని, కానీ భూమిని కాపాడాలనే నిబద్ధతతోనే దేశంలోనే అత్యున్నత న్యాయవాదులైన సీఎస్ వైద్యనాథన్ వంటి వారిని నియమించి సుప్రీంలో పోరాటం కొనసాగించామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే సాహెబ్‌నగర్ కేసులో సుప్రీంకోర్టు దాకా పోరాటం జరిగితే, కాంగ్రెస్ వచ్చిన కొద్ది నెలలకే వచ్చిన తీర్పును తన ఖాతాలో వేసుకుంటూ రేవంత్ బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. పూటకోమాటతో రేవంత్‌రెడ్డి అపరిచితుడులా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

