IPL 2023 : సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(101: 58 బంతుల్లో 13 ఫోర్లు, ఒకసిక్స్)సెంచరీ బాదాడు. అచ్చొచ్చిన అహ్మదాబాద్ స్టేడియంలో చెలరేగిన గిల్ ఐపీఎల్ శతకం నమోదు చేశాడు. నటరాజన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఈ ఫీట్ సాధించాడు. ఈ లీగ్‌లో అతడికి ఇదే తొలి శతకం కావడం విశేషం.
మూడు ఫార్మాట్లలో వంద కొట్టిన ఈ యంగ్‌స్టర్ ఐపీఎల్‌లోనూ అద్భుతంగా ఆడుతున్నాడు. గత మ్యాచుల్లో తొంభైల్లోనే అతను నాలుగు సార్లు ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్‌పై 95 వద్ద ఔటైన అతను ఈ సారి అనుకున్నది సాధించాడు. దాంతో, ఈ సీజన్లో మూడంకెల స్కోర్ చేసిన ఆరో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
That HUNDRED feeling 🤗
Follow the match ▶️ https://t.co/GH3aM3hyup #TATAIPL | #GTvSRH | @ShubmanGill pic.twitter.com/C9UyUBvHd1
— IndianPremierLeague (@IPL) May 15, 2023