ఆ దేశంలో 2021 చివరినాటికి 70 శాతం మందికి కరోనా టీకా..

బీజింగ్: కరోనా వ్యాప్తికి కారణమైన చైనా ఇప్పుడు దేశంలో మహమ్మారి కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. చైనా లక్ష్య జనాభాలో కనీసం 70 శాతం మందికి ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్ -19 టీకాలు వేసే అవకాశం ఉందని జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) డిప్యూటీ హెడ్ డాక్టర్ జెంగ్ ఇక్సిన్ వెల్లడించారు. ఇటీవల నమోదైన కరోనా కేసులను గమనిస్తే మహమ్మారి నివారణ, నియంత్రణ చర్యలు నిరంతంగా ఉధృతంగా కొనసాగించాల్సిన అవసరముందన్నారు.
టీకాలు వేసుకునేందుకు ప్రజలు వెనుకాడవద్దని కోరారు. అందరం కలిసికట్టుగా ఉండి “గ్రేట్ వాల్ ఆఫ్ ఇమ్యునైజేషన్” లక్ష్యాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు. ఎన్‌హెచ్‌సీ డేటా ప్రకారం.. ఇప్పటివరకూ చైనా అంతటా 763 మిలియన్ డోసు కొవిడ్-19 టీకాలు ఇచ్చారు. కరోనా మహమ్మారి మొదట 2019 డిసెంబర్లో చైనా హుబీ ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో వెలుగుచూసింది.ఇప్పటివరకు చైనాలో 91,248 కరోనా కేసులు నమోదయ్యాయని, 4,636 మంది మృత్యువాతపడ్డారని చైనా వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

