Good Bad Ugly | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar) నటిస్తోన్న యాక్షన్ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో షురూ అయినట్టు వార్తలు వచ్చాయిని తెలిసిందే. ఈ షెడ్యూల్లో అజిత్‌పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్‌తోపాటు ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేశారని ఇస్సైడ్ టాక్. కాగా తాజా షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ప్రస్తుతం సిటీలో గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ కొనసాగుతుండగా.. అజిత్ కుమార్ టీంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత త్వరలోనే అజిత్ టీం రష్యాకు వెళ్లనుందని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని చెప్పకనే చెబుతోంది.
ఇప్పటివరకు వచ్చిన కథనాల ప్రకారం ఈ ఇత్రంలో అజిత్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతుండగా.. వీటిలో ఒకటి నెగెటివ్ రోల్ అని టాక్. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారని సమాచారం.
అజిత్‌కుమార్ మరోవైపు లీడ్ రోల్లో నటిస్తోన్న Vidaa Muyarachiకు సంబంధించి భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ కొనసాగుతుందని ఓ వార్త ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్లు బాబీ డియోల్, జాన్ అబ్రహాం పేర్లు వినిపిస్తుండగా.. ఎవరిని ఫైనల్ చేశారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.