ఒక్కరోజే పెరిగిన బంగారం ధర.. ఎంతంటే!
పెరిగిన బంగారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే తులం బంగారం ధర రూ.881 పెరిగింది.

న్యూఢిల్లీ: తులం బంగారం ధర దేశీయ రాజధాని ఢిల్లీలో భారీగా పెరిగింది. గురువారం తులం బంగారం ధర రూ.881 పెరిగి రూ.44,701కి చేరుకున్నది. గోల్డ్ గ్లోబల్ మార్కెట్లో ధరల్లో రికవరీ సాధించడంతో దేశీయ మార్కెట్లో ధర మెరుగైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపాయి. బుధవారం 10 గ్రాముల బంగారం రూ.43,820గా పలికింది. వెండి కూడా అదే బాటలో పయనించింది.
కిలో వెండిపై రూ.1071లు పెరగడంతో దాని ధర 63,256కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,719 అమెరికా డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 24.48 డాలర్లుగా ట్రేడవుతోంది.
ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.500లకు పైగా పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ.46,370గా ఉంది. అలాగే, కిలో వెండి ధర రూ.65,969గా ఉంది. ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడం వల్లే ధరలు పెరిగినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం పెట్టుబడికి సురక్షితంగా భావిస్తున్నారని, అందుకే వాటి ధరలు పెరుగుతున్నాయని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫ్యూచర్స్ మార్కెట్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర రూ.185 పెరిగి రూ.45,120కి చేరుకున్నది. జూన్ డెలివరీ ధర రూ.45,120గా నమోదైన తులం బంగారం ధర ఫ్రెష్ పొజిషన్‌కు చేరుకున్నది. అంతర్జాతీయంగా న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,716.50 డాలర్లు పలికింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవికూడా చదవండి..
చిప్‌ల కొరతతో ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్‌లు విలవిల
టెస్లాకు షాక్: విద్యుత్ వాహన రంగంలోకి షియోమీ
బంపరాఫర్: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్
జూన్ వరకూ.. వృద్ధుల ఎస్బీఐ వీకేర్ గడువు పొడిగింపు
టెస్లాకు షాక్: విద్యుత్ వాహన రంగంలోకి షియోమీ
ఇన్వెస్టర్లూ.. బీ వేర్: ఏప్రిల్‌లో 11 రోజులు సెలవులే!
దీదీ.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

