
మోహన్‌కృష్ణ, దేవిసౌజన్య, దాసరి శిరీష, శీతల్భట్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘గోవాలో గోపాలకృష్ణుడు’ లోకేష్ గౌడ్ దర్శకుడు. సుధాకర్, సంగీత, పవన్‌కుమార్ నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి క్లాప్‌నిచ్చారు. వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. హీరో మోహనకృష్ణ మాట్లాడుతూ ‘గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. గోపాలకృష్ణుడు ఎవరు? నలుగురు అమ్మాయిలతో అతడికి ఉన్న అనుబంధమేమిటనేది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తిచేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.