న్యూఢిల్లీ, జూలై 18: బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్, కేఫిన్టెక్ల సహకారంతో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో ఓ సెక్యూరిటీస్ మార్కెట్ హ్యాకథాన్‌ను ప్రారంభించింది. సెక్యూరిటీస్ మార్కెట్లో ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి డిజిటల్-ఫస్ట్ సొల్యూషన్స్‌ను అభివృద్ధిపర్చేందుకున్న మార్గాల అన్వేషణే లక్ష్యంగా ఈ హ్యాకథాన్‌ను మొదలుపెట్టారు. ఇదిలావుంటే పోర్ట్‌ఫోలియోస్ స్కీముల్లో ఓవర్లాప్ ఇష్యూను పరిష్కరించేందుకు, స్పష్టతను మెరుగుపర్చేందుకు కేటగిరీలవారీగా మ్యూచు వల్ ఫండ్ స్కీముల సమీక్షకు శుక్రవారం సెబీ ప్రతిపాదించింది. మరోవైపు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే ఎన్ఎస్ఈలో ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్‌ను ప్రారంభించారు.