న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోలో బాలిక చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను తిన్లయ్ భూటియా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో తన ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేస్తుండగా బాలిక మెట్రో లోపల డ్యాన్స్ చేస్తుండటం కనిపించింది. ఈ సన్నివేశం అంతటినీ మరో ప్రయాణీకుడు కెమెరాలో రికార్డు చేశారు.
మీరు సరిగ్గానే చదివారు..కాన్ఫిడెన్స్ అంటే ఇదేనని ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పటివరకూ ఆరు లక్షలకు పైగా వ్యూస్ రాబట్టగా నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. బాలిక వీడియోను అలా రికార్డు చేసే కాన్ఫిడెన్స్ మీకుందని ఓ యూజర్ కామెంట్ చేయగా ఈ వీడియోను రికార్డు చేసే ధైర్యం మీకుందని మరో యూజర్ రాసుకొచ్చాడు.