Srisailam Temple | శ్రీశైలంలో ఘనంగా గిరిప్రదక్షిణ
Srisailam Temple | ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంగా

శ్రీశైలం : ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంగా శాస్త్రోక్తంగా జరిగింది. చివరిసారిగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గత మార్చిలో మార్చి నెలలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆ తర్వాత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నిబంధనలు పాటిస్తూ.. కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సమయంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారికి మంగళహారతి ఇచ్చి, ఉత్సవమూర్తులను పల్లకీలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.

ఆ తర్వాత పల్లకీసేవ ఊరేగింపుతో గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నంది మండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, పంచ మఠాలు, మల్లమ్మ కన్నీరు, పుష్కరిణి వద్దకు, అక్కడి నుంచి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంది. నంది మండపం నుంచి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగిసింది. ప్రదక్షిణలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి నామస్మరణతో శ్రీగిరులు మార్మోగాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

