IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో ఆరెంజ్ క్యాప్ (Orange Cap) విజేత ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది. క్రీజులో ఉన్నంతసేపు ఊచకోతను తలపించే బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)కి ఈ టోపీ దక్కడం లాంఛనమే. ఎందుకంటే.. ఫైనల్‌కు ముందు వైభవ్‌కు గట్టి పోటీనిచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(Shubman Gill), సాయి సుదర్శన్(Sai Sudarshan) రేసులో వెనకబడ్డారు. వీరకొట్టుడుతో దిగ్గజ ఆటగాళ్లతో ప్రశంసలందుకున్న పదిహేనేళ్ల క్రికెట్ సంచలనం తలపై ఈసారి ఆరెంజ్ క్యాప్ సగర్వంగా వాలిపోనుంది.
ఐపీఎల్ 19వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌ను తన్నుకుపోవడం ఖాయమైంది. సీజన్ ఆసాంతం విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచస్థాయి బౌలర్లను భయపెట్టిన ఈ చిన్నోడు 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడమే అందుకు కారణం. ఎలిమినేటర్‌లో 97, క్వాలిఫయర్ 2లో 96 రన్స్‌తో చెలరేగిన ఈ యువకెరటం అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు.
At the age of 15 years and 65 days, Vaibhav Sooryavanshi is all but assured now of winning the Orange Cap in his first full IPL season after Sai Sudharsan and Shubman Gill’s failure in the final. 🫡#IPL2026 #RajasthanRoyals pic.twitter.com/3UnnxqbVJK
— Circle of Cricket (@circleofcricket) May 31, 2026
అయితే.. క్వాలిఫయర్ 2లో సెంచరీతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. అర్ధ శతకంతో మెరిసిన ఓపెనర్ సాయి సుదర్శన్‌లు వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. దాంతో.. ఫైనల్లో ఇద్దరిలో ఒక్కరు భారీ ఇన్నింగ్స్ ఆడినా వైభవ్‌ను దాటేసి ఆరెంజ్ క్యాప్ గెలుస్తారనిపించింది.
కానీ, అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ బౌలర్ల ధాటికి గిల్ 10కి ఔటవ్వగా.. సుదర్శన్ 12 పరుగులకే వికెట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇద్దరూ 732, 722 రన్స్‌తో రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నారు. ఇక 600 పరుగులతో ఆరో స్థానం సాధించిన విరాట్ కోహ్లీ ఫైనల్లో ఒకవేళ సెంచరీ కొట్టినా వైభవ్‌ను అందుకోవడం కష్టం.
2️⃣ massive wickets. 1️⃣ dream start! 💥
What a start for #RCB in Ahmedabad 🔥
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/loIvgOBVc4
— IndianPremierLeague (@IPL) May 31, 2026
దాంతో.. తన రెండో ఐపీఎల్ సీజన్లో వైభవ్ ఆరెంజ్ క్యాప్ విజేతగా అవతరించనున్నాడు. 19వ సీజన్లో ఏకంగా ముగ్గురు 700లకు పైగా పరుగులు సాధించారు. ఐపీఎల్ సీజన్లో ముగ్గురు ఆటగాళ్లు ఇన్నేసి రన్స్ కొట్టడం ఇదే మొదటిసారి.